- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సూర్య షూటింగ్ సెట్‌లో చిరుతపులి బీభత్సం.. షాకింగ్ విషయాలు చెప్పిన వెంకీ
మేము ఫెర్న్‌హిల్ ప్యాలెస్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఒకరోజు ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయిన అరగంటకే అక్కడికి చిరుతపులి వచ్చి ఒక కుక్కను నోట కరుచుకుని తీసుకెళ్లిపోయింది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ షూటింగ్ సెట్‌లో జరిగిన ఒక భయంకరమైన సంఘటనను దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా బయటపెట్టారు. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. "మేము ఫెర్న్‌హిల్ ప్యాలెస్‌లో షూటింగ్ చేస్తున్నాం. ఒకరోజు ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయిన అరగంటకే అక్కడికి చిరుతపులి వచ్చి ఒక కుక్కను నోట కరుచుకుని తీసుకెళ్లిపోయింది. ఆ మరుసటి రోజు మా షూటింగ్‌కు చివరి రోజు. రాత్రి 10:30 గంటల సమయంలో మళ్ళీ చిరుతపులి అక్కడకు వచ్చింది. ప్యాలెస్ వెనుక భాగం అంతా దట్టమైన అడవి కావడంతో అది ఎప్పుడు వస్తుందో, ఎటు వెళ్తుందో ఎవరికీ అర్థం కాలేదు" అని చెప్పారు.
ఇంకా గంటన్నర పని చేస్తే షూటింగ్ మొత్తం పూర్తవుతుందనగా.. ఒక్కసారిగా పులి వచ్చింది అని అరుపులు మొదలయ్యాయి. అందరూ పరుగులు తీశారు. అయితే అది పులి కాదు, ఏదైనా కుక్క అయి ఉంటుందని భావించి నేను కాస్త ముందుకు వెళ్లానని వెంకీ అట్లూరి అన్నారు. కానీ, సరిగ్గా ఆయన కళ్ల ముందే ఆ చిరుతపులి వెళ్ళిందని చెప్పారు. "ఆ సమయంలో నేను కూడా భయపడ్డాను. కానీ ఒకవేళ నేను పులిని చూశానని చెబితే అందరూ భయపడి షూటింగ్ ఆపేస్తారు. అందుకే ఎవరికీ చెప్పకుండా సైలెంట్‌గా ఉండి షూటింగ్ పూర్తి చేశాను. అది నా జీవితంలో మర్చిపోలేని భయంకరమైన మూమెంట్" అని ఆయన వివరించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు చిరుతపులితో పోరాటం చేసి షూటింగ్ కంప్లీట్ చేయడం గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు.






