- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మైఖేల్ జాక్సన్ మూన్‌వాక్ హ్యాట్ వేలం.. అప్పట్లో ఏం జరిగిందంటే..
by Bhoopathi Nagaiah |
ఫేమస్ మూన్‌వాక్ డ్యాన్స్‌ను ప్రదర్శించే ముందు మైఖేల్ జాక్సన్ తన హ్యాట్‌ను వేదిక వైపుకు విసిరాడు.

X
దిశ, ఫీచర్స్ : ఫేమస్ మూన్‌వాక్ డ్యాన్స్‌ను ప్రదర్శించే ముందు మైఖేల్ జాక్సన్ తన హ్యాట్‌ను వేదిక వైపుకు విసిరాడు. ఈ ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు అవుతోంది. అయితే తాజాగా అతను విసిరిన ఆ హ్యాట్‌ను పారిస్‌లోని హోటల్ డ్రౌట్‌లో సెప్టెంబర్ 26న వేలం వేయనున్నారు. ఈ బ్లాక్ ఫెరోడా ధర రూ. 53 లక్షల నుంచి రూ. 89 లక్షల వరకు పలకవచ్చుననే అంచనాలు ఉన్నాయి. ఇది దాదాపు 200 రాక్ మెమోరాబిలియా వస్తువులలో ‘స్టార్’ అయినప్పటికీ.. ఇటీవలి కాలంలో వాల్యూ పడిపోయందని తెలుస్తోంది. 1983లో టెలివిజన్ ద్వారా ప్రసారమైన మోటౌన్ మ్యూజిక్ ఈవెంట్‌లో పాప్ కింగ్ జాక్సన్ ఈ టోపీని విసిరేశాడు. అప్పట్లో ఆడమ్ కెల్లీ అనే వ్యక్తి దానిని తీసుకున్నాడు. జాక్సన్ సిబ్బంది ఎవరైనా దానికోసం వస్తారని ఎదురు చూశాడు. కానీ ఎవరూ రాలేదు. కాగా దాన్నే ఇప్పడు వేలం వేస్తున్నామని ఆర్గనైజర్ పెరాల్ట్ తెలిపాడు.
Next Story






