ఇలాంటి నీచులను వదిలేస్తే ఇంకా పెంచి పోషించడమే అవుతుంది.. సుమ పోస్ట్ శివాజీని ఉద్దేశించేనా?

by Mallepaka Hamsa |

‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు ధరించే అర్ధనగ్న దుస్తులపై నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపాయి.

ఇలాంటి నీచులను వదిలేస్తే ఇంకా పెంచి పోషించడమే అవుతుంది.. సుమ పోస్ట్ శివాజీని ఉద్దేశించేనా?
X

దిశ, సినిమా: ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్లు ధరించే అర్ధనగ్న దుస్తులపై నటుడు శివాజీ(Shivaji) చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపాయి. సినీ సెలబ్రిటీలే ఆయన వైఖరిని తప్పు బడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. రాజ్యాంగాన్ని ధిక్కరించారంటూ ఆయనపై మండిపడుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, అనసూయ, సింగర్ చిన్మయి ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మహిళా సీరియస్ అవడంతో పాటు మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముందుగా దీనికి శివాజీ ఒప్పుకోనప్పటికీ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో క్షమాపణ కోరుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. దీంతో ఆ వివాదానికి కాస్త చెక్ పడిందనుకుంటే.. ఈ విషయంపై సినీ సెలబ్రిటీలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ఆయన చేసిన మాటలు మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో మహిళా నటీమణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా, ఈ విషయంపై యాంకర్ సుమ(Suma) ,శివాజీ తీరును తప్పుపట్టింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఓ నోట్ విడుదల చేసింది. ఇటీవల నేను ఎకో అనే సినిమాను చూశానని చెప్పింది. సినీ ఇండస్ట్రీలో నిధి అగర్వాల్, సమంతకు జరిగిన సంఘటనలు మనకు హెచ్చిరికలాంటివని పేర్కొన్నారు. ఇలాంటివి చూస్తుంటే మహిళలకు భద్రత, గౌరవం ఎక్కడుందనిపిస్తోందని? ప్రశ్నించారు. ఇలాంటి వేధింపులకు పాల్పడే వారిని, అవమానించే నీచులను వదిలేయడం అంటే ఇంకా వారిని పెంచి పోషించడమే అవుతుందని ఫైర్ అయ్యారు. మహిళలకు రక్షణ కల్పించడం.. ఆంక్షలు పెట్టడం ఒక్కటి కాదని పేర్కొంది. మహిళలను వేధింపులకు గురిచేయడంతో పాటు అవమానించడం సరికాదని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇవి శివాజీని ఉద్దేశించే చెప్పిందనే చర్చ మొదలైంది. link

Next Story