ప్రసాద్ ల్యాబ్‌లో ‘యూనిటీ’ చిత్ర ప్రదర్శన.. ప్రశంసించిన తెలంగాణ ఉద్యమ నేతలు

by Bhoopathi Nagaiah |

తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత కథ ఆధారంగా బడుగు విజయ కుమార్ రూపొందించిన చిత్రం ‘యూనిటీ’.

ప్రసాద్ ల్యాబ్‌లో ‘యూనిటీ’ చిత్ర ప్రదర్శన.. ప్రశంసించిన తెలంగాణ ఉద్యమ నేతలు
X

దిశ, సినిమా: తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత కథ ఆధారంగా బడుగు విజయ కుమార్ రూపొందించిన చిత్రం ‘యూనిటీ’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాను చిత్ర నిర్మాత చిరందాస్ ధనంజయ బాపూజీ జయంతి సందర్భంగా ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించారు. ఈ షోకు ముఖ్య అతిథిగా వచ్చిన TBCC చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్.. కొండా లక్ష్మణ్ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. అలాగే దర్శకనిర్మాతల టాలెంట్‌ను నటి పూనమ్ కౌర్ కొనియాడగా.. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి ఈ డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సాధిస్తుందన్నారు. ఇక వీరితోపాటు విమలక్క, రోషం బాలు, శ్రీ రాములు, సత్యం, వెంకన్న, సుధాకర్, జ్ఞానేశ్వర్, యాదగిరి, శ్రీధర్, గురునాథం, వెంకటేశం, రాం నర్సయ్య తదితరులు ఈ సందర్భంగా బాపూజీగారితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటిస్తామన్నారు మేకర్స్.

Next Story