Chandramukhi :నోరు జారిన లారెన్స్.. చంద్రముఖిపై కీలక అప్డేట్ రివీల్

by Dishanational2 |
Chandramukhi :నోరు జారిన లారెన్స్.. చంద్రముఖిపై కీలక అప్డేట్ రివీల్
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్రముఖి సినిమా ఎంత సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతే కాకుండా చాలా మంది ఇప్పటికీ ఆ సినిమాను మర్చిపోలేరు. కాగా, ఈ మూవీపై రాఘవలారెన్స్ సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో,లారెన్స్ కంగనా రాధిక శరత్ కుమార్, లక్ష్మి మీనన్, వడివేలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా చిత్రీకరణ పనులు శర వేగంగా జరిగాయి. కాగా, ఇప్పిటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.కాగా, లారెన్స్ రుద్రుడు సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొనగా, ఓ యాంకర్ మాట్లాడుతూ.. చంద్రముఖి సినిమా గురించి అడుగుతూ,రజినీకాంత్ చంద్రముఖిలో పాము వెళ్లిపోవడంతో ఎండ్ చేశారు. మరి దానికి కంటిన్యూ చంద్రముఖి 2 సినిమాలో ఉంటుందా, అసలు ఆ పామును ఈసినిమాలో చూపిస్తారా అని ప్రశ్నించగా, లారెన్స్ సమాధానమిస్తూ.. అది ప్రస్తుతానికి సస్పెన్స్. కానీ ఆ పాముకు,ఈ కథకు ముగింపు చంద్రముఖి 3లో ఉంటుంది అని అన్నారు. దీంతో చంద్రముఖి 3 కూడా ఉండబోతున్నట్టు దాదాపు క్లారిటీ ఇచ్చేశారు లారెన్స్.

Read more:

మీ మొగుడికీ ఎలా నిద్రొస్తుందే? హన్సికపై వల్గర్ కామెంట్స్

అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ‘ఏజెంట్’ ట్రైలర్ ..

Next Story