మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్.. బయటపడిన ఆ హీరోతో, లావణ్య లవ్ ఎఫైర్

by Dishanational2 |
మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్..  బయటపడిన ఆ హీరోతో, లావణ్య లవ్ ఎఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. ఎన్నో రోజుల నుంచి వస్తున్న వార్తలకు తెర పడింది. లావణ్య, వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారంటూ వారు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా, ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ, మెగా ఫ్యామిలీ వరుణ్, లావణ్యకు ఘనంగా ఎంగేజ్ మెంట్ చేశారు.ఇక ఈ నిశ్చితార్థ వేడుకకు, మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యారు. త్వరలో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటి కానుంది.

ఇదిలా ఉంటే ఈ క్రమంలో లావణ్యకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? లావణ్య వరుణ్ తేజ్ కంటే ముందు మరొకరిని పీకల్లోతు ప్రేమించిందంట. ఆ హీరో ఎవరు అనే విషయాన్నికొస్తే ఆయన కూడా మెగా హీరో కావడం గమనార్హం. ఒకానొక సమయంలో లావణ్య త్రిపాఠి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ ని పొగుడుతూ.. వరుణ్ తేజ్ ని తగ్గిస్తూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన రాపిడ్ ఫైర్ లో భాగంగా మీకు నచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎవరు ది బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అని మీరు అనుకుంటున్నారు అంటే ఆమె వెంటనే సాయి ధరమ్ తేజ్ పేరు చెప్పింది. ఏ అమ్మాయి అయినా అలాంటి లక్షణాలున్న అబ్బాయిని కోరుకుంటుందని, వరుణ్ తేజ్ మంచోడు కాదు అని చెప్పను, కానీ సాయిధరమ్ తేజ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ లో ది బెస్ట్ అంటూ చెప్పుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది.

Also Read: లావణ్యతో వరుణ్ ప్రేమ, పెళ్లి ఆమె కోట్ల ఆస్తి కోసమేనా..?



Next Story

Most Viewed