సాయి ధరమ్‌తేజ్ మ్యూజిక్ ఆల్బమ్ ‘సత్య’పై లేటెస్ట్ అప్‌డేట్

by Disha Web Desk 7 |
సాయి ధరమ్‌తేజ్ మ్యూజిక్ ఆల్బమ్ ‘సత్య’పై లేటెస్ట్ అప్‌డేట్
X

దిశ, సినిమా: ఇటీవల పవర్ స్టార్‌తో కలిసి ‘బ్రో’ మూవీతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్.. తాజాగా హీరోయిన్ కలర్ స్వాతితో కలిసి ఓ మ్యూజికల్ ఆల్బమ్ చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్‌లో దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మాణంలో నవీన్ విజయ కృష్ణ ‘సత్య’ అనే టైటిల్‌తో ఈ మ్యూజిక్ ఆల్బమ్ తెరకెక్కిస్తున్నారు. శృతి రంజని దీనికి సంగీతం అందిస్తుంది. మన దేశం కోసం పనిచేసే హీరోలకు సంగీత నివాళి ఇస్తూ సాయితేజ్, స్వాతిరెడ్డి త్వరలో ఈ ఆల్బమ్‌‌తో మీ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే మూవీ నుంచి రిలీజైనా ఫస్ట్ లుక్ పోస్టర్‌ బాగా ఆకట్టుకుంది. సోమవారం 6 గంటలకు మరో అప్‌డేట్ ఇవ్వబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Read More: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మహావీరుడు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?


Next Story