'లియో' చివరి షెడ్యూల్ పై తాజా అప్డేట్

by Disha Web Desk 1 |
లియో చివరి షెడ్యూల్ పై తాజా అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్, తలపతి విజయ్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'లియో'. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష జోడిగా నటిస్తుంది. అక్టోబర్ 19, 2023న సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోందని, ఈ షెడ్యూల్ లో విజయ్, అర్జున్ సర్జాలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తాజా సమాచారం.

అంతే కాకుండా ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందు కోసం భారీ సెట్‌ ని వేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

Also Read.

ఆ పద్ధతి ప్రకారమే మాకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి.. యామీ గౌతమ్


Next Story

Most Viewed