- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి నిమిషంలో ‘చాయ్ వాలా’ టైటిల్ మార్పు.. కొత్త పేరు రివీల్ చేస్తూ హీరోయిన్ పోస్ట్
‘చాయ్ వాలా’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘నవాబ్ కేఫ్’(Nawab Cafe) అనే కొత్త పేరును ఖరారు చేశారు.

దిశ, సినిమా: శివ కందుకూరి(Shiva Kandukuri) హీరోగా, ప్రమోద్ హర్ష (Pramod Harsha)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎమోషనల్ డ్రామా ‘చాయ్ వాలా’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో..తాజాగా మూవీ మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్‌ను అనూహ్యంగా మారుస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటివరకు ‘చాయ్ వాలా’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘నవాబ్ కేఫ్’(Nawab Cafe) అనే కొత్త పేరును ఖరారు చేశారు.
ఈ విషయాన్ని హీరోయిన్ తేజు అశ్విని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. హర్షిక ప్రొడక్షన్ బ్యానర్‌పై రిధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్ పాపుడిప్పు నిర్మిస్తున్న ఈ చిత్రం.. తండ్రి, కొడుకుల మధ్య ఉండే సున్నితమైన భావోద్వేగాల నేపథ్యంలో సాగనుంది. ఇందులో రాజీవ్ కనకాల ఒక పవర్‌ఫుల్ ప్రధాన పాత్రలో కనిపిస్తుండటం విశేషం. కాగా, ఫిబ్రవరి 20న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే విడుదలకి మరికొద్ది రోజులే సమయం ఉన్న సమయంలో టైటిల్ మార్చడం వెనుక గల కారణాలు ఏమై ఉంటాయని నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కథలోని లోతును, ఎమోషన్‌ను మరింత ప్రభావవంతంగా చూపించడానికే ఈ ‘నవాబ్ కేఫ్’ అనే పేరును ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లోని టాక్.






