నయనతారకు కవల పిల్లలు.. ముందే చెప్పిన Jr.NTR (వీడియో)

by Disha Web Desk 2 |
నయనతారకు కవల పిల్లలు.. ముందే చెప్పిన Jr.NTR (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతారా ఇద్దరు పండంటి మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నయన్ భర్త విఘ్నేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తమ పిల్లలను ఆశీర్వదించాలని కోరారు. సుమారు ఏడేళ్ల పాటు ప్రేమలో నయనతారా, విఘ్నేష్ శివన్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాడి జూన్ 9వ తేదీన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మహాబలిపురంలో వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వీరిని ఆశీర్వదించారు. అయితే, గాడ్ ఫాదర్‌తో హిట్‌ కొట్టి సంతోషంలో ఉన్న నయనతారకు ఇద్దరు మగ కవల పిల్లలు పుట్టడంతో ఆనందం రెట్టింపయ్యింది.

అయితే, అదుర్స్ సినిమాలో స్విమ్మింగ్ ఫూల్ సీన్‌లో నయనతారకు ఇద్దరు కవల పిల్లలు పుడతారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన సీన్‌ను సోషల్ మీడియాలో అభిమానులు వైరల్‌ చేస్తున్నారు. నయన్‌కు కవలలు పుడతారని ఎన్టీఆర్ ముందే గెస్ చేశారని సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

అవకాశాలకోసం పడుకుంటే తప్పేం కాదు.. 'బిగ్ బాస్' కంటెస్టెంట్

ఒకే బెడ్‌‌రూమ్‌లో ఇద్దరు లేడీ స్టార్స్.. అలా చేస్తూ కనిపించడంతో

Next Story

Most Viewed