లేడీ బాస్ ఈజ్ బ్యాక్.. ఆండ్రియా ‘కాన’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-01 13:04:29  IST  )

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది.

లేడీ బాస్ ఈజ్ బ్యాక్.. ఆండ్రియా  ‘కాన’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆండ్రియా జెర్మియా(Andrea Jeremiah) ఇప్పుడు మరో విభిన్నమైన హారర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌తో మన ముందుకు వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కాన’(kaana). ఈ సినిమాలో ఆండ్రియా ఒక డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. అడవిలో మిస్టీరియస్‌గా జరుగుతున్న వరుస మరణాల వెనుక ఉన్న భయంకరమైన నిజాన్ని ఛేదించే ఒక పవర్‌ఫుల్ ఆఫీసర్ కథను దర్శకుడు నాన్‌జిల్ ( Nanjil)వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్‌తో తీర్చిదిద్దారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలై కొన్నేళ్లు అవుతున్నప్పటికీ పలు కారణాల వల్ల విడుదల నోచుకోలేదు. అయినప్పటికీ ఈ సినిమా చుట్టూ ఉన్న హైప్ మామూలుగా లేదు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ మొదలై ఏళ్లు గడుస్తోంది.

జాన్ మ్యాక్స్ శశికల ప్రొడక్షన్స్, షాలోమ్ స్టూడియోస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం, పలు సాంకేతిక కారణాల వల్ల ల్యాబ్‌కే పరిమితమైంది. దీంతో ఆండ్రియా అభిమానులు ఈ సినిమా అసలు విడుదలవుతుందా? లేదా? అని ఆందోళన చెందారు. కానీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్‌ను ఇస్తాయని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఈ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మార్చి 6వ తేదీన తెలుగులో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర బృందం అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. మార్చి మొదటి వారంలోనే థియేటర్లలో భయంకరమైన మిస్టరీని రివీల్ చేసేందుకు ఆండ్రియా సిద్ధమైపోయింది. హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సమ్మర్ సీజన్ ఆరంభంలోనే ఒక అదిరిపోయే ట్రీట్ దొరకబోతోంది.

Next Story