ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయడం కోసం తెగ కష్టపడుతోన్న లేడీ అసిస్టెంట్ డైరెక్టర్!

by Disha Web Desk 9 |
ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయడం కోసం తెగ కష్టపడుతోన్న లేడీ అసిస్టెంట్ డైరెక్టర్!
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా రాబోతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. డిసెంబర్ ఎండింగ్‌కు సినిమా చిత్రీకరణ పూర్తికాబోతుంది. ఆ తర్వాత తారక్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘వార్ 2’ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తానే స్వయంగా యాక్షన్ స్టంట్స్ చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఇందులో నెగెటివ్ షేడ్‌లో కనిపించనున్న తారక్.. మరో స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు గట్టిపోటీ ఇస్తాడనే టాక్ వినిపిస్తుంది. అయితే హృతిక్ పక్కన హీరోయిన్‌గా ఇప్పటికే దీపికను సెలెక్ట్ చేయగా.. వీరిద్దరి కాంబినేషన్‌లో విదేశాల్లో షూటింగ్ పూర్తయింది. కాగా ఇప్పుడు తారక్ జోడీని సెట్ చేసే పనిలో ఉన్నాడు డైరెక్టర్. ఈ క్రమంలోనే యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్‌ను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. కాగా ప్రముఖ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి పలు హిట్ మూవీస్‌లో నటించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె గురించి సెర్చ్ చేసే తారక్ ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరిగినట్లు టాక్. కాగా ఈ అమ్మడు హాట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ సినిమా కోసమేనా ఈ అందాల ఆరబోతా? అంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు.


Next Story

Most Viewed