- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పెద్ది’ సినిమాలో కుషిత.. పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిన యంగ్ బ్యూటీ!
రామ్ చరణ్(Ram Charan), ‘పెద్ది’(peddi) సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను కుషిత రీషేర్ చేసింది.

దిశ, సినిమా: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించి, తనదైన గ్లామర్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది కుషిత కల్లపు(Kushitha Kallapu). కేవలం రీల్స్, ఫొటో షూట్స్‌కే పరిమితం కాకుండా, వెబ్ సిరీస్‌లు.. సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గత ఏడాది రాజ్ తరుణ్ సరసన ‘చిరంజీవ’ అనే చిత్రంలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇప్పుడు ఏకంగా ఒక పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కాబోతోందనే వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ చర్చలకు ప్రధాన కారణం కుషిత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన ఒక ఆసక్తికరమైన పోస్ట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’(peddi) సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను ఆమె రీషేర్ చేసింది. సాధారణంగా నటీనటులు తాము నటిస్తున్న సినిమాల అప్‌డేట్స్‌ను మాత్రమే ఇలా షేర్ చేస్తుంటారు.
ఇక కుషిత కూడా అదే ఫాలో కావడంతో.. ఈ భారీ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తోందని, ఆ విషయాన్ని ఇలా హింట్ ఇచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. ‘ఉప్పెన’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు (Buchibabu Sana)తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇటువంటి ప్రతిష్టాత్మక చిత్రంలో కుషితకు అవకాశం దక్కితే, అది ఆమె కెరీర్‌కు ఖచ్చితంగా పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు.






