రామ్ చరణ్ కోసం వెనక్కి తగ్గిన అఖిల్..‘లెనిన్’ పోస్టర్‌తో పెరుగుతున్న అనుమానాలు!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-15 10:17:40  IST  )

రామ్ చరణ్ కోసం వెనక్కి తగ్గిన అఖిల్..‘లెనిన్’ పోస్టర్‌తో పెరుగుతున్న అనుమానాలు!
X

దిశ, సినిమా: అక్కినేని అఖిల్(Akkineni Akhil) తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘లెనిన్’(Lenin). ‘ఏజెంట్’ తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న అఖిల్, ఈసారి రాయలసీమ నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాతో మన ముందుకు రాబోతున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా నడుస్తున్న సస్పెన్స్‌కు చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన కన్నడ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మొదట ఈ సినిమాను మే 1న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఏప్రిల్ 30న రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’(peddi) సినిమా విడుదల కానుండటంతో, థియేటర్ల సర్దుబాటు , బిజినెస్ పరంగా ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ‘లెనిన్’ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

వాయిదా ఖాయం

ఈనేపథ్యంలో.. తాజాగా, చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో అఖిల్, భాగ్యశ్రీ సైకిల్‌పై వెళ్తూ చాలా ప్లెజెంట్‌గా, ప్యూర్ లవ్ స్టోరీని తలపిస్తున్నారు. కానీ, ఈ పోస్టర్‌లో ఎక్కడా కూడా సినిమా విడుదల తేదీని (మే 1) ప్రస్తావించలేదు. సాధారణంగా భారీ చిత్రాల ప్రమోషన్లలో రిలీజ్ డేట్ ఖచ్చితంగా ఉంటుంది. తాజా పోస్టర్‌లో డేట్ లేకపోవడంతో, సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయమని అందుకే డేట్ మెన్షన్ చేయకుండా హింట్ ఇచ్చారని అంతాపలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ, గ్రాఫిక్స్ లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అఖిల్ లుక్, రాయలసీమ యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలవనున్నాయని టాక్. అఖిల్ ‘లెనిన్’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘పెద్ది’ సినిమాలో కుషిత.. పోస్ట్‌తో కన్ఫర్మ్ చేసిన యంగ్ బ్యూటీ!

Next Story