‘కుబేర’ ట్రైలర్ అప్డేట్.. ఫైరింగ్ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-12 13:52:14  IST  )

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’(kubera).

‘కుబేర’ ట్రైలర్ అప్డేట్.. ఫైరింగ్ పోస్టర్‌తో క్యూరియాసిటీ పెంచేసిన మేకర్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush), టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున(Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’(kubera). భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

అయితే ‘కుబేర’ మూవీ జూన్ 20న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయిన చిత్రబృందం వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా, చిత్రబృందం ‘కుబేర’ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ జూన్ 13న శుక్రవారం రాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ధనుష్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో ఆయన బిచ్చగాడిలా కనిపించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచారు.

Next Story