నానితో మరోసారి రొమాన్స్ చేయనున్న డిజాస్టర్ హీరోయిన్ ?

by velandi.Saikiran |

టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానికి ( Nani ) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే మినిమం గ్యారెంటీ

నానితో మరోసారి రొమాన్స్ చేయనున్న డిజాస్టర్ హీరోయిన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానికి ( Nani ) ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమా రిలీజ్ అయింది అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. బంపర్ హిట్ అయిన కొడతారు... లేదా కలెక్షన్స్ వసూలు చేస్తారు. అలాంటి హీరో నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమాతో (The Paradise ) బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే... ఫస్ట్ లుక్ తో పాటు... చిన్నపాటి టీజర్ కూడా వచ్చింది. ఇందులో తెలంగాణ యాస, భాష ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే... దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela ) తీస్తున్న ఈ సినిమాలో.. హీరోయిన్ ఎవరు అనే దాని పైన తీవ్రమైన చర్చ జరుగుతోంది.

దసరా సినిమా కోసం కీర్తి సురేష్ ను ( Keerthy Suresh) రంగంలోకి దింపారు. అయితే ఇప్పుడు కొత్త హీరోయిన్... కోసం వెతుకుతుందట చిత్ర బృందం. అయితే ఇందులో హీరో నాని సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ( Kriti Shetty) తీసుకుంటే బాగుంటుందని సంప్రదింపులు చేశారట. ఈ విషయంలో భాగంగానే... హీరోయిన్ కృతి శెట్టితో ( Kriti Shetty ) దర్శకుడు శ్రీకాంత్ కూడా చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికి హీరోయిన్ కృతి శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే రెమ్యూనరేషన్ దగ్గరే... కాస్త అటు ఇటుగా ఉందట హీరోయిన్ కృతి శెట్టి. ఆ ఒక్కటి క్లియర్ అయితే.. అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృతి శెట్టి, నాని కాంబో లో శ్యామ్ సింగ రాయి సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ది ప్యారడైజ్ సినిమా వచ్చే ఏడాది ఎండాకాలంలో రిలీజ్ కానుంది.

Next Story