‘Adipurush’ సినిమాపై విమర్శలు.. కృతి సనన్ తల్లి గీతా సనన్ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2023-06-22 06:33:01  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. జూన్ 16న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది.

‘Adipurush’ సినిమాపై విమర్శలు.. కృతి సనన్ తల్లి గీతా సనన్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. జూన్ 16న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ అయింది. మహాకావ్యం రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం కావడంతో పలు విమర్శలకు దారి తీసింది. విడుదలైన ఫస్ట్ షో నుంచే ఈ సినిమాలోని డైలాగ్స్, పాత్రలపై పలువురు ప్రముఖులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంతేకాకుండా రామాయణాన్ని అవమానించారని హిందూ సంఘాలు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. తాజాగా, ఈ విమర్శలపై కృతి సనన్ తల్లి గీతా సనన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ‘‘ ప్రజలు ఒక నిర్దిష్ట విషయాన్ని మంచి మనస్తత్వం, ఆలోచనతో చూడాలి. మనం సరైన దృక్పథంతో చూసినప్పుడే మనకు ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మనకు భగవంతుడు రాముడు ప్రేమను పంచమని ప్రజలకు బోధించాడు. శబరి రాముడికి అందించిన ప్రేమను చూడాలి. కానీ ఆ వ్యక్తి తప్పులను చూడకూడదు. ఎదుటి వారి భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్’’ అంటూ రాసుకొచ్చింది.

Click Here For Instagram Post

Read more: పూజను చిక్కుల్లో పడేస్తున్న ముగ్గురు హీరోయిన్స్ .. ఎలా అంటే?

Next Story