Kriti Sanon కు Prabhas ముందు ప్రపోజ్ చేశాడు..? ఉమైర్ సంధూ ట్వీట్

by Disha Web Desk 6 |
Kriti Sanon కు Prabhas ముందు ప్రపోజ్ చేశాడు..? ఉమైర్ సంధూ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ కలిసి 'ఆదిపురుష్' సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోయారని టాక్. అంతేకాకుండా డేటింగ్‌లో ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తపై కృతి సనన్ 'బేధియా' ప్రమోషన్స్‌లో భాగంగా అవకాశం వస్తే ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రముఖ రివ్యూవర్ ఉమైర్ సంధూ నిత్యం పలు సినిమాలపై సోషల్ మీడియా వేధికగా రివ్యూలు ఇస్తుంటాడు. తాజాగా, ప్రభాస్, కృతి సనన్ పై ఆసక్తికర ట్వీట్ చేశాడు. ''ఆఫీషియల్లీ కన్ఫార్డ్మ్.. 'ఆదిపురుష్' షూటింగ్'లో కృతి సనన్‌ కు ప్రభాసే ప్రపోజ్ చేశాడు. వారిద్దరు రిలేషన్‌లో ఉన్నారు. త్వరలోనే నిశ్చితార్థం'' అంటూ రెండు హార్ట్ ఎమోజీలను షేర్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు నెగిటీవ్ కామెట్లు చేస్తూ..రకరకాల మీమ్స్‌తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : " గాలోడు " సినిమా 10 వ రోజు కూడా కలెక్షన్స్‌లో దూసుకెళ్తుంది !


Next Story

Most Viewed