- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకున్న కృతి శెట్టి.. స్టార్ కిడ్‌తో రొమాన్స్!
యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty)‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఈ సొట్ట బుగ్గల సుందరి మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty)‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఈ సొట్ట బుగ్గల సుందరి మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన ఆమె వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో గోల్డెన్ లెగ్ అని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ వరుసగా మూడు ప్రాజెక్ట్స్ డిజాస్టర్ కావడంతో అమ్మడు తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఆమె నటించిన వా వాతియార్, లవ్ ఇన్సురెన్స్ కంపెనీ, జీనీ మూడు చిత్రాలు షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. పలు కారణాల వల్ల పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, కృతి శెట్టి కోలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ దర్శకుడు శంకర్ వారసుడు ఆర్జిత్ శంకర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు ఏఆర్ మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన ఆయన నటనపై ఆసక్తితో ఇండస్ట్రీకి రాబోతున్నాడు. ఇక ఇందులో ఆర్జిత్(Arjit Shankar)కు జోడీగా మమితను అనుకున్నప్పటికీ కృతి శెట్టిని ఫైనల్ చేసినట్లు టాక్. ఇందులో నటించేందుకు ఆమెను సంప్రదించగా.. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) ఇందులో విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. దీనికి డైరెక్టర్ అట్లీ శిష్యుడొకరు దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న వారంతా ఈ ప్రాజెక్ట్ అయినా రిలీజ్ అయి కృతికి లక్కు కలిసొస్తుందా? లేదా అని నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






