Super Star Krishna: ఇద్దరు భార్యలు చనిపోవడంతోనే..

by Chukka Sudharani |   (  Updated:2022-11-15 05:53:42  IST  )

సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన 1924 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. తర్వాత 1961లో ఇందిరాదేవిని వివాహమాడారు.

Super Star Krishna: ఇద్దరు భార్యలు చనిపోవడంతోనే..
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ కృష్ణ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన 1942 మే 31న గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. తర్వాత 1961లో ఇందిరాదేవిని వివాహమాడారు. వీరికి రమేశ్‌బాబు, మహేశ్‌బాబు, ప్రియదర్శిని, మంజుల, పద్మావతి పిల్లలు. ఇక 1969లో కృష్ణ సహచార నటి అయిన విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. ఆమెకు అప్పటికే కొడుకు నరేష్ ఉన్నారు. ఇక విజయ నిర్మల 2019లో అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి కృష్ణ మానసికంగా కృంగి పోయారు. ఈ ఏడాది కుమారుడు రమేశ్‌బాబు, ఇందిరాదేవి మరణించడంతో మరింత మనోవేదనకు గురికావడంతోనే ఆయనకు గుండెపోటు వచ్చినట్టు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

నింగికేగిన నట శిఖరం..

Next Story