'కొంచెం చూసి ప్రేమించు డూడ్' ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!

by Disha Web Desk 7 |
కొంచెం చూసి ప్రేమించు డూడ్ ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
X

దిశ, సినిమా: వేద ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై గోదావరి రెస్టారెంట్ దుబాయ్ సహాయంతో కార్తిక్ రెడ్డి, వరుణ్ దగ్గుబాటి నిర్మిస్తున్న చిత్రం 'కేసీపీడీ' (కొంచెం చూసి ప్రేమించు డూడ్). గౌతం మన్నవ దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి ప్రేమికుల రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు ప్రజెంట్ జనరేషన్‌లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కబోతున్న చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు దర్శకనిర్మాతలు. అలాగే ఈ మార్చిలో షూటింగ్ పూర్తిచేసి సమ్మర్‌లోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. తనీష్ అల్లాడి, శ్రీరామ్ రెడ్డి, ద్వారక వి.డి.ఎన్ (బంటి), సుభశ్రీ రాయగురు, ప్రియాంక పాసల, దివ్య దిల్చోకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రానికి శ్రీకరబాబు సినిమాటోగ్రఫీ, పీఆర్‌వో మధు.

Also Read...

'వినరో భాగ్యము విష్ణు కథ' అందరినీ ఆకట్టుకుంటుంది: బన్నీ వాసు


Next Story

Most Viewed