‘రాబందు’ ట్రైలర్ రిలీజ్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వైల్డ్‌గా ఉంటుందనడంతో భారీ హైప్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-11 07:44:21  IST  )

ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్(Bhanu Prasad), సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబందు’(rabandu).

‘రాబందు’  ట్రైలర్ రిలీజ్ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వైల్డ్‌గా ఉంటుందనడంతో భారీ హైప్
X

దిశ, సినిమా: ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్(Bhanu Prasad), సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబందు’(rabandu). జయశేఖర్ కల్లు (Jayasekhar Kallu)దర్శకత్వంలో రాబోతున్న శ్రీమతి పులిజాల నరసమ్మ సమర్పణలో పులిజాల ఫిల్మ్స్ పతాకంపై పులిజాల సురేష్ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఈ మూవీ ట్రైలర్ సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy)గారు రిలీజ్ చేసి యూనిట్ అభినందనలు తెలియజేశారు. అనంతరం గెస్ట్‌గా వచ్చిన దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్‌ను విడుదల చేయగా చిత్ర నటి ప్రీతి నిగమ్ టీజర్ లాంచ్ చేశారు.

ఇంకా సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర , రేణు కుమార్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం.. చిత్ర దర్శకులు జయశేఖర్ కల్లు మాట్లాడుతూ.. నేటిసమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలన ఆధారంగా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో పులిజాల ఫిలిమ్స్ బ్యానర్ మీద మేము నిర్మించిన చిత్రం ‘రాబందు’. మా చిత్ర ట్రైలర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా విడుదల చేసి మాకాయన ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చిత్ర నిర్మాత సురేష్ గారు నన్ను నమ్మి సినిమా నాకు అప్పగించారు. సినిమా అనుకున్న విధంగా చాలా బాగా వచ్చింది.

అలాగే ఈ చిత్రం బాగా రావడానికి ఎంతో కష్టపడ్డ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు ధన్యవాదములు. మంచి కాన్సెప్ట్‌తో త్వరలో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అని అన్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. డైరెక్టర్ జయశేఖర్ నాకు మంచి మిత్రుడు.. పూర్తిగా క్రైమ్ ఎంటర్టైన్మెంట్‌గా వస్తున్న ఈ సినిమా తనకిది నాలుగో సినిమా. యానిమల్ సినిమా లాగా రాబందు టైటిల్ చాలా మాస్ ఉంది. టైటిల్ లాగే ఈ సినిమా కూడా వైలెంట్‌గా ఉంటుందనుకుంటున్నాను. ఇందులో నటించిన ప్రీతి గారికి, మా జూనియర్ రాజశేఖర్ ఇలా ఈ మూవీకి పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి లైఫ్ ఇవ్వాలని ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అనడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.

Next Story