- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షూటింగులో గాయపడ్డ కోలీవుడ్ హీరో!
కోలీవుడ్ యంగ్ హీరో అరుణ్ విజయ్, ఏ.ఎల్.విజయ్ కలయికలో

X
దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో అరుణ్ విజయ్, ఏ.ఎల్.విజయ్ కలయికలో రూపొందుతున్న చిత్రం 'అచ్చం ఎన్బదు ఇల్లైయే'. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. అయితే అనుకొకుండా షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు హీరో అరుణ్ విజయ్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. దీంతో కేరళ రాష్ట్రానికి వెళ్లి ఆయుర్వేద చికిత్స చేయించుకుంటున్నాడు అరుణ్ విజయ్. చికిత్సకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు విజయ్. 'మోకాళ్ల గాయానికి ఆయుర్వేద విధానంలో చికిత్స జరుగుతుంది. ఇది నాలుగో రోజు చికిత్స. త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటా' అని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు 'త్వరగా కోలుకోవాలని మీ కోసం ప్రార్థిస్తాం' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Next Story






