- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోలివుడ్ దర్శకుడు లింగుసామికి జైలు శిక్ష..
పందెం కోడి, ఆవారా, ది వారియర్ వంటి చిత్రాల దర్శకుడు ఎన్ లింగుసామికి చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది.

X
దిశ, సినిమా: పందెం కోడి, ఆవారా, ది వారియర్ వంటి చిత్రాల దర్శకుడు ఎన్ లింగుసామికి చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడింది. కొన్ని సంవత్సరాల క్రితం.. కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ పేరుతో ఓ సినిమా తీయాలని లింగుసామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ పీవీపీ సినిమాస్ నుంచి రూ.1.03 కోట్ల అప్పు తీసుకున్నారు. అయితే ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు. దీంతో తీసుకున్న డబ్బును చెక్కు రూపంలో తిరిగి చెల్లించారు. అయితే, ఆ చెక్కు బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సోమవారం ఈ కేసు విచారణకు రాగా లింగుసామి, సుభాష్ చంద్రబోస్‌లకు సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
ఇవి కూడా చదవండి: షాహిద్ కపూర్ బ్లడీ డాడీ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
Next Story






