‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’ స్పెషల్ స్కీనింగ్‌లో సెలబ్రిటీల సందడి

by Disha Web Desk 13 |
‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’ స్పెషల్  స్కీనింగ్‌లో సెలబ్రిటీల సందడి
X

దిశ, సినిమా: ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాఫీ విత్‌ ఏ కిల్లర్‌’. సెవెన్‌హిల్స్‌ సతీష్‌ నిర్మించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే ఆర్పీ పట్నాయక్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ పురష్కరించుకుని మూవీ స్పెషల్ స్ర్కీనింగ్‌ నిర్వహించారు మేకర్స్. ఈ షోకు హాజరైన షఫీ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చింది. కథను కొత్తగా చూపించారు. దర్శకనిర్మాతలకు అభినందనలు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు.

అలాగే సెన్సార్ కార్యక్రమాలు పూర్తైన సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చిందని చిత్ర నిర్మాత తెలుపాడు. చివరగా ‘ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకుల పల్స్ మారింది. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలనే ఆదరిస్తున్నారు. అలాంటి సినిమాలు కోరుకునే వారి కోసమే ఈ సినిమా తీసుకొచ్చాం. మాకు ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. అందరికీ ధన్యవాదాలు’ చెప్పాడు దర్శకుడు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed