సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కిష్కింధపురి’.. గుండె ధైర్యం లేని వారు మా సినిమాకు రావొద్దంటూ మేకర్స్ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ‘భైరవం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కిష్కింధపురి’.. గుండె ధైర్యం లేని వారు మా సినిమాకు రావొద్దంటూ మేకర్స్ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) ‘భైరవం’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. త్వరలో ఆయన హారర్ సినిమాతో అందరినీ భయపెట్టేందుకు ‘కిష్కింధపురి’(Kishkindhapuri)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కౌశిల్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran)హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘కిష్కింధపురి’ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అలాగే ఇందులోని నటీనటుల లుక్స్ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆసక్తిని కలిగించాయి.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 12న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. తాజాగా, చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తైనట్లు వెల్లడించారు. ‘‘సెన్సార్ బోర్డు ఎటువంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి Aసర్టిఫికెట్‌ను జారీ చేసింది. పిల్లలు, గుండె ధైర్యంలేని వారు మా సినిమాకు రావొచ్చు. అత్యంత భారీ రూపంలో న్యూ-ఏజ్ హర్రర్‌లో రాబోతుంది సిద్ధంగా ఉండండి. భయంతో కేకలు వేయడానికి రెడీనా’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే ఈ మూవీకి పిల్లలు దూరంగా ఉండాలంటూ ‘A’ మొత్తం రక్తంతో కనిపిస్తుండగా.. ఆకాశంలో మెరుపులు వస్తుండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ భయంతో ఏదో చూస్తున్న పోస్టర్‌ను షేర్ చేశారు.

LINK

Next Story