- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా స్కెచ్.. బాలీవుడ్ మేకర్స్‌తో భారీ మైథలాజికల్ థ్రిల్లర్!
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), ఇప్పుడు తన రూట్ మార్చి పాన్ ఇండియా స్థాయికి ఎదిగేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: 'క' చిత్రంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram), ఇప్పుడు తన రూట్ మార్చి పాన్ ఇండియా స్థాయికి ఎదిగేందుకు సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఆయన, ప్రస్తుతం విభిన్న కథలు ఎంచుకుంటూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. ఇప్పటికే ‘బేబీ’ ఫేమ్ సాయి రాజేష్ కథ అందిస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’(Chennai Love Story) షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న కిరణ్, దీనితో పాటు ఒక భారీ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా(Prerna Arora), జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పేలా, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ మైథలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కనుంది.
కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా, తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. చిత్ర యూనిట్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వచ్చే సెప్టెంబర్ నెలలో గ్రాండ్‌గా ప్రారంభించేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. విభిన్నమైన విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ సినిమా కిరణ్ అబ్బవరం ఇమేజ్‌ను నేషనల్ లెవల్‌కు తీసుకెళ్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు 'చెన్నై లవ్ స్టోరీ' వంటి ప్యూర్ లవ్ స్టోరీతో పాటు, ఇటు భారీ మైథలాజికల్ సినిమాను లైన్‌లో పెట్టడం తెలిసిన నెటిజన్లు కిరణ్ ప్లాన్ అదిరిపోయిందని అంటున్నారు.






