వరుస సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం..

by Disha Web Desk 13 |
వరుస సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం..
X

దిశ, సినిమా: కిర‌ణ్ అబ్బవ‌రం హీరోగా శివం సెల్యులాయిడ్స్ ప‌తాకంపై ప్రొడ‌క్షన్ నెంబ‌ర్-2గా ఒక సరికొత్త ల‌వ్ యాక్షన్ డ్రామా రూపొంద‌నుంది. విశ్వక‌రుణ్ ద‌ర్శకుడిగా ప‌రిచయం అవుతున్న సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్‌లో ఘ‌నంగా జ‌రిగింది. హీరోపై చిత్రీక‌రించిన ముహూర్తపు స‌న్నివేశానికి వి.వి. వినాయ‌క్ క్లాప్ కొట్టగా.. ద‌గ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం. ర‌త్నం కెమెరా స్విచాన్ చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి నిర్మాత‌లు కె.ఎస్. రామారావు, జెమిని కిర‌ణ్‌, శిరీష్, వ‌ల్లభ‌నేని వంశీ, న‌ల్లమ‌ల‌పు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోద‌ర‌ప్రసాద్, కె.కె.రాధామోహ‌న్, బెక్కెం వేణుగోపాల్, ప్రస‌న్న కుమార్, తుమ్మల‌ప‌ల్లి రామ‌ స‌త్యనారాయ‌ణ‌ త‌దిత‌రులు అతిథులుగా హాజ‌రై సినిమా భారీ విజ‌యం సాధించాల‌ంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చివరగా ఈ నెలలోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తామన్న మేకర్స్.. ఇత‌ర వివ‌రాల‌ను త్వర‌లోనే వెల్లడిస్తామ‌న్నారు. కాగా ‘వినరో భాగ్యం విష్ణుకథ’తో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం.. తాజాగా ‘మీటర్’ టీజర్‌తో మాస్ అప్పియరెన్స్ ఇవ్వగా.. ఏప్రిల్ 7న సినిమా విడుదల కానుంది.



Next Story

Most Viewed