- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిరణ్ అబ్బవరంకు షాక్.. ‘క’ సీక్వెల్ విషయంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రం ‘క’.

దిశ, సినిమా: కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రం ‘క’. కిరణ్ అబ్బవరం, నయన్ సారిక కాంబోలో వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. సందీప్ ద్వయం తెరకెక్కించిన ఈ మూవీనిశ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ నిర్మించారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు మొదటి పార్ట్ క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఏడాది అవుతున్నప్పటికీ ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. దీంతో కిరణ్ అభిమానులు అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా.. ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత చింతా గోపాలకృష్ణ (Chinta Gopalakrishna)చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.
సినిమా సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది అన్న ప్రశ్నకు నిర్మాత స్పందిస్తూ.. "సీక్వెల్‌ను 2027 జనవరిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొదటి భాగాన్ని తెరకెక్కించిన సందీప్-సుజీత్ జంటే ఈ ప్రాజెక్ట్‌ను కూడా హ్యాండిల్ చేస్తారు. అయితే, హీరో విషయంలో మాత్రం దర్శకుల నిర్ణయమే ఫైనల్. కథ డిమాండ్ చేస్తే కిరణ్ అబ్బవరంకు బదులుగా వేరే హీరోతో కూడా వెళ్లే అవకాశం ఉంది" అని బాంబు పేల్చారు. ఈ చిత్రంతో హిట్ అందుకోవాలని చూస్తున్న కిరణ్‌కు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. సీక్వెల్‌లో హీరో మారుతారేమో అన్న నిర్మాత వ్యాఖ్యలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దీంతో కిరణ్ అబ్బవరంకు, నిర్మాతకు మధ్య ఏవైనా గొడవలు జరిగాయా? లేక కథా పరంగా మార్పులు చేస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘క’ సినిమా క్లైమాక్స్ చూసిన వారు మాత్రం, కిరణ్ పాత్ర లేకుండా సీక్వెల్ ఊహించుకోవడం కష్టమని అభిప్రాయపడుతున్నారు.






