- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కె-ర్యాంప్’ నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం.. భారీ ధమాకా అంటూ పోస్ట్
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘క’ సినిమాతో ఘన విజయం సాధించాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘క’ సినిమాతో ఘన విజయం సాధించాడు. ఈ మూవీతో ఆయన క్రేజ్ మరింత పెరిగిందనడంతో అతిశయోక్తి లేదు. భారీ కలెక్షన్లు కూడా రాబట్టి పలు రికార్డులు క్రియేట్ చేయడంతో మంచి ఫాలోయింగ్ వచ్చింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘కె-ర్యాంప్’(K-Ramp)ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. క మీద కలిసొచ్చిందనే ఉద్దేశంతో ఆ పదం టైటిల్‌లో ఉండేలా చూసుకున్నాడు. ఈ సినిమా జైన్స్ నాని(Jains Nani) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.
మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండ, శివ బొమ్మక్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూడవ చిత్రం కావడం విశేషం. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ 18న దీపావళి పండుగ కానుకగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ‘కె-ర్యాంప్’ నుంచి విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా.. కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ నుంచి డబుల్ అప్డేట్స్ ఇస్తూ ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల కాబోతుండగా.. ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 11న కాబోతున్నట్లు వెల్లడించాడు. అలాగే ‘కె-ర్యాంప్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 15న జరగబోతున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా భారీ ధమాకా అక్టోబర్ 18న ఫుల్ ఎంటర్‌టైన్ చేయనున్నామని అన్నాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న కిరణ్ అబ్బవరం అభిమానులు ఆనందపడుతున్నారు.






