నాగబాబు కారణంగానే జబర్దస్త్ వదిలేశా.. స్టార్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 9 |
నాగబాబు కారణంగానే జబర్దస్త్ వదిలేశా.. స్టార్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: నెల్లూరు యాసతో తనదైన స్టైల్‌లో కామెడీ పండిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు కిరాక్ ఆర్పీ. టీంలో ఒక సభ్యుడిగా అడుగుపెట్టి లీడర్ అయ్యాడు. ఏళ్ల తరబడి జబర్దస్త్‌లో రాణించి.. సడన్‌గా షోకు గుడ్‌బై చెప్పాడు. ఇకపోతే తాజాగా కిరాక్ ఆర్పీ ఓ ఇంటర్వ్యూకు హాజరై జబర్దస్త్ మానేయడానికి కారణం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు.

‘‘ఫుడ్, పేమెంట్స్ తో పాటు ఆర్పీ జబర్దస్త్ షో మానేయడానికి నాగబాబు కూడా ఓ కారణమేనని తెలిపాడు. నాగబాబు జబర్దస్త్ వదిలేశాక ఈ నటుడు అక్కడ ఉండలేకపోయాని, ఆయన నవ్వితే జనాలు నవ్వేవారని, జనాలు ఎక్కడ నవ్వుతారో తెలిసి నాగబాబు అక్కడే నవ్వుతారని, అలా తాము స్కిట్ కొట్టేవాళ్లమని ఆర్పీ వెల్లడించాడు. అంతేకాకుండా నాగబాబు బాగా సపోర్ట్ చేస్తారు. స్కిట్ బాగా చేస్తే ప్రశంసిస్తారు.

ఆషామాషీగా స్కిట్ చేస్తే ఊరుకోరు. భయపెడతారు. కొట్టే వరకూ వెళతారు. స్కిట్ సరిగా చేయలేకపోతే సమస్యేంటని ప్రశ్నిస్తారు. స్కిట్‌లో ఎక్కువగా డబుల్ మీనింగ్ కామెడీ ఉంటే కంట్రోల్ చేస్తారు. సలహాలు, సూచనలు ఇస్తారు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నాగబాబు జబర్దస్త్ మానేశాక నేను కూడా జబర్దస్త్ వదిలేయాలని నిర్ణయించుకున్నాను. అంటూ కిరాక్ ఆర్పీ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

ప్రస్తుతం కిరాక్ ఆర్పీ పెద్దారెడ్డి చేపల పులుసు వ్యాపారంలో బాగా రాణిస్తున్నాడు. హైదరాబాద్ లో రెండు బ్రాంచ్‌లు ఉన్నాయి. రీసెంట్‌గా తిరుపతిలో ఒక బ్రాండ్ ఏర్పాటు చేశాడు. దాని ఓపెనింగ్‌కు మంత్రి రోజా, హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాడా హాజరయ్యారు.

Read More..

అలా చెప్పడానికి ఒక్కడుంటే చాలు ఏదైనా సాధించొచ్చు.. అందుకే కనెక్ట్ అయిపోయా: నిహారిక


Next Story