భారీ యాక్షన్‌తో కిచ్చా సుదీప్ ‘మార్క్’ ట్రైలర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:42:25  IST  )

కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kiccha Sudeep) హీరోగా చేస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘మార్క్’ (Mark)ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

భారీ యాక్షన్‌తో కిచ్చా సుదీప్ ‘మార్క్’ ట్రైలర్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్(Kiccha Sudeep) హీరోగా చేస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘మార్క్’ (Mark)ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. సుదీప్ కెరీర్‌లో 47వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ కార్తికేయ (Vijay Karthikeya)దర్శకత్వం వహిస్తుండగా, సెంథిల్ త్యాగరాజన్ , అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ థ్రిల్లర్ పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తుంది. ట్రైలర్‌లో ప్రారంభం నుండి చివరి వరకు డార్క్, ఇంటెన్స్ ట్రీట్‌మెంట్ ఆసక్తిని రేపుతోంది. ఒక పట్టణంలో వరుసగా చిన్నపిల్లలు మిస్టరీగా కనిపించకుండా పోతుండటంతో కేసు సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఈ సంక్లిష్టమైన సంభవాల్ని ఛేదించేందుకు సుదీప్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ అవుతాడు.

ఒంటరి పోరాటం, ఇంటెన్స్ ఇన్వెస్టిగేషన్, యాక్షన్‌తో నిండిన సుదీప్ స్టైలిష్ ప్రెజెన్స్ ట్రైలర్‌ను మరింత హైలైట్ చేసింది. సుదీప్ పాత్రలో కనిపించిన రగ్డ్ లుక్, గ్రిప్పింగ్ డైలాగ్స్, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవీన్ చంద్ర, గురు సోమసుందరం, యోగిబాబు, విక్రాంత్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపిస్తూ కథకు బలంగా మారేలా చేశారు. ముఖ్యంగా పిల్లల కేసుల చుట్టూ తిరిగే మిస్టరీ, దాని వెనుక ఉన్న రహస్య నెట్‌వర్క్ ట్రైలర్‌లో చూపించినంతవరకు కథలో ప్రధాన థ్రిల్‌గా మారనుంది. సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకోగా.. పోస్ట్-ప్రొడక్షన్ పనులు ఫైనల్ దశలో ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ట్రైలర్‌ చూసిన ప్రేక్షకులు కిచ్చా సుదీప్ మరోసారి మాస్‌గా ఎక్స్‌ప్లోడ్ అవుతాడని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Next Story