- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిచ్చా సుదీప్ ‘మార్క్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)ఓ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kiccha Sudeep)ఓ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన కెరీర్ 40 ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ చిత్రానికి ‘మార్క్’ (Mark)టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పాన్ ఇండియా సినిమాను విజయ్ కార్తికేయ(Vijay Karthikeya) తెరకెక్కిస్తున్నారు. ‘మార్క్’ మూవీని సత్య జ్యోతి ఫిల్మ్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై సెంధిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే గ్లింప్స్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా, ‘మార్క్’ మూవీ మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 6న లిరికల్ వీడియో విడుదల కాబోతున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘మార్క్ గర్జనకు ట్యూన్ వస్తుంది. పిడికిలికి బీట్ రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేస్తూ.. కిచ్చా సుదీప్ సిగరెట్ తాగుతున్న పోస్టర్‌ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






