కిచ్చా సుదీప్ బర్త్ డే స్పెషల్.. BRB ఫస్ట్ లుక్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.

కిచ్చా సుదీప్ బర్త్ డే స్పెషల్.. BRB ఫస్ట్ లుక్‌తో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(Kiccha Sudeep) పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే పోస్టర్లు విడుదలవుతూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నాయి. తాజాగా, కిచ్చా సుదీప్ నటిస్తున్న ‘బిల్లా రంగా బాషా’(Billa Ranga Basha)(BRB) సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ‘‘ప్రతి సామ్రాజ్యం మోకరిల్లడానికి నిరాకరించే వ్యక్తికి భయపడుతుంది. నువ్వు ఒక తిరుగుబాటుదారుడిని చంపలేవు.. మా తదుపరి షెడ్యూల్‌ చాలా కీలకం. దీంతో మా ప్రయాణంలో ఊహించని మార్పులు వస్తాయి. పెద్దదిగా పెరగడంతో పాటు సినిమా రేంజ్ మారిపోతుంది’’ అని వెల్లడించారు.

ఇక ఫస్ట్ లుక్‌లో కిచ్చా సుదీప్ వెరైటీ డ్రెస్‌లో ఉండగా.. తన ముందు మంటలు వస్తున్నట్లు చూపించారు. సముద్రం, కొండలు ఉన్న చోట ఓ పెద్ద ఆయుధంతో పవర్ ఫుల్ లుక్‌తో కనపించాడు. అలాగే ఇందులో ఓ రెడ్ కలర్ సింబల్‌ను కూడా చూపించి క్యూరియాసిటీ పెంచారు. కాగా.. ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ సరసన రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటిస్తుండగా.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం భాషల్లో తెరకెక్కుతోంది.

link

Next Story