సినిమాల విషయంలో కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం.. ట్వీట్ వైరల్

by Disha Web Desk 6 |
సినిమాల విషయంలో కిచ్చా సుదీప్ కీలక నిర్ణయం.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ‘ఈగ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘విక్రాంత్ రోణ, కబ్జా వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా, కిచ్చా సుదీప్ సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తన ట్విట్టర్ వేదికగా ఓ నోట్ షేర్ చేశాడు. ‘‘ హాయ్ ఫ్రెండ్స్.. కిచ్చా46 గురించి మీ ట్వీట్స్, మీమ్స్‌ చూశా. అలా పిలవడం నాకు కూడా సంతోషంగా ఉంది. దీనిపై మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలచుకున్న. ప్రస్తుతం సినిమాల నుంచి నేను స్వల్ప విరామం తీసుకుంటున్నాను. ఇది నా మొదటి బ్రేక్. విక్రాంత్ రోణ, బిగ్ బాస్‌ సుదీర్ఘ షెడ్యూల్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నా. ఈ సమయాన్ని ఆనందంగా ఆస్వాదించాలనుకుంటున్నాను. క్రికెట్ కూడా నా లైఫ్‌లో ఓ భాగం. నన్ను సంతోషపరిచే పనిలో క్రికెట్ ఖచ్చితంగా ఉండి నాకు విశ్రాంతి నిస్తుంది. నా సినిమాలకు సంబంధించి మూడు స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వాటిని ఓకే చేశా. ప్రతి రోజు వాటిపై వర్క్ జరుగుతూనే ఉంటుంది. త్వరలోనే అప్‌డేట్స్‌తో మీ ముందుకు వస్తా. లాట్స్ ఆఫ్ లవ్ అండ్ హగ్స్’’ అంటూ రాసుకొచ్చాడు.


Next Story

Most Viewed