యష్ సరసన నటించడానికి అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న కియారా.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

by I. Sairam |

యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

యష్ సరసన నటించడానికి అన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న కియారా.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్విని యోగం చేసుకుంటూ ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తుంది. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాతో మన ముందుకు వచ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ రాకింగ్ స్టార్ యష్(Yash) సరసన ‘టాక్సిక్’(Toxic) మూవీలో నటిస్తోంది. గీతు మోహన్‌దాస్(Geethu Mohandas) తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఇందులో నయనతార(Nayanathara) యష్‌కు అక్కగా నటిస్తోంది. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానున్నట్లు రీసెంట్‌గా మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో యష్ సరసన నటించడానికి కియారాకు రూ.15 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇదే కనుక నిజం అయితే బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా యాడ్ అయిపోతుంది.

Next Story