సరిహద్దుల్లో రియల్ హీరోస్‌తో కియారా సంబరాలు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)

by Disha Web Desk 6 |
సరిహద్దుల్లో రియల్ హీరోస్‌తో కియారా సంబరాలు.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని ఫగ్లీ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ మూవీలో నటించి తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో రాబోతుంది. తాజాగా, ఈ అమ్మడు వాఘా సరిహద్దుల్లో భారత జవాన్లతో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే కియారా నటిస్తున్న న్యూ మూవీ అమృత్‌సర్‌లో జరుగుతుంది. దగ్గరలోని వఘా బార్డర్‌కు వెళ్లి మిలటరీ బలగాలను కలిసి దేశభక్తిని చాటుకుంది. అలాగే జెండాను ఊపుతూ దేశంలోనే నిజమైన హీరోలతో సమయం గడపడం ఆనందంగా ఉందని తెలిపింది. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు కియారా దేశభక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed