- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ అభిమానులకు డబుల్ ధమాకా.. ఆ రెండు ఒకేరోజు రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తే వారి సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా మహేష్ బాబు ఫ్యాన్స్‌తో మొదలైంది

దిశ, సినిమా : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పుట్టినరోజులు వస్తే వారి సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా మహేష్ బాబు ఫ్యాన్స్‌తో మొదలైంది. ఈ సందర్భంగా 'పోకిరి' సినిమా విడుదలై భారీ కలెక్షన్లను రాబట్టింది. తర్వాత పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీస్ 'జల్సా', 'తమ్ముడు' సినిమాలను కూడా అత్యధిక థియేటర్లలో విడుదల చేయగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివచ్చి విజయవంతం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 'జల్సా' సినిమా కన్నా 'ఖుషి' సినిమా ఎంతో అద్భుతమైన సినిమా. ఈ నేపథ్యంలో 'ఖుషీ' మూవీనీ కూడా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న గ్రాండ్‌గా రీ రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇదిలావుంటే.. లేటెస్ట్‌గా ఫ్యాన్స్ మధ్య ఓ టాక్ నడుస్తుంది. ఏమిటంటే 'ఖుషి' రిలీజ్‌తో పాటు అదే రోజు పవన్ అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు' నుంచి టీజర్‌ను విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.






