- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khushi Kapoor: బాయ్‌ఫ్రెండ్ బర్త్ డే పార్టీలో రచ్చ రచ్చ చేసిన ఖుషీ కపూర్.. సంచలనంగా మారిన ఫొటోలు!
అతిలోక సుందరి కూతురు ఖుషి కపూర్(Khushi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: అతిలోక సుందరి కూతురు ఖుషి కపూర్(Khushi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ‘లవ్ టుడే’ మూవీ రీమేక్‌లో నటించి మెప్పించింది. ఇక ది అర్చీస్(The Archies), నాదానియాన్(Nadaaniyan), వంటి చిత్రాల్లో నటించింది. ఇక ఇటీవల ‘లవ్‌యప్ప’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ఖుషి తన గ్లామరస్ ఫొటోలతో విపరీతమైన ఫాలోయింగ్‌ను దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు గత కొద్ది కాలంగా వేదాంగ్ రైనాతో డేటింగ్ చేస్తున్నట్లు పలు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
వీరిద్దరు పలు పార్టీలకు, వెకేషన్స్‌కు కూడా వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఖుషి కపూర్ తన బాయ్‌ఫ్రెండ్ వేదాంగ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నది. పక్కనుండి మీ కేక్ కట్ చేయించడంతో పాటు ఫొటోలు, రీల్స్ చేస్తూ రచ్చ రచ్చ చేసింది. ఇక ఈ పార్టీకి బ్లాక్ కలర్ డ్రెస్‌లో వెళ్లిన ఖుషి థైయ్స్ షో చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. వీరిద్దరు లవ్‌లో ఉన్నారంటూ త్వరలోనే జాన్వీకంటే ముందే పెళ్లి చేసుకుంటారని చర్చించుకుంటున్నారు.






