- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > Khushboo: ఆ విషయం చెప్పినందుకు నేను సిగ్గుపడట్లేదు: తండ్రి వేధింపులపై నటి
Khushboo: ఆ విషయం చెప్పినందుకు నేను సిగ్గుపడట్లేదు: తండ్రి వేధింపులపై నటి
స్టార్ నటి, జాతీయ కమీషన్ సభ్యురాలు ఖుష్బూ మరోసారి లైంగిక వేధింపుల ఇష్యూపై స్పందించింది.

X
దిశ,సినిమా: స్టార్ నటి, జాతీయ కమీషన్ సభ్యురాలు ఖుష్బూ మరోసారి లైంగిక వేధింపుల ఇష్యూపై స్పందించింది. ఇటీవల తన చిన్నతనంలో తండ్రి వల్ల శారీరకమైన హింసకు గురయ్యానని సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, మార్చి 8 మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ఝార్ఖండ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఆమె స్త్రీ శక్తి గురించి మాట్లాడింది. ‘నాకు జరిగిన అన్యాయాన్ని ఈ ప్రపంచానికి చెప్పేందుకు ఏ మాత్రం సిగ్గుపడట్లేదు. నిజాయితీగా అందరికీ తెలియజేశాను. దీనిలో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నాపై దారుణానికి పాల్పడినవాళ్లే సమాజం ముందు తలదించుకోవాలి. అతివలను కించపరిచేవారిని ఎన్నడూ ప్రోత్సహించకూడదు. నాలాగే వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరూ ధైర్యంగా ముందుకెళ్లాలి’ అంటూ తనదైన స్టైల్‌లో వ్యాఖ్యలు చేసింది.
Read more:
- Tags
- kushboo
Next Story






