- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అభిమానులతో 700 సెల్ఫీలు దిగిన KGF hero Yash (వీడియో)
'కేజీఎఫ్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యశ్.

దిశ, సినిమా: 'కేజీఎఫ్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో యశ్. ప్రస్తుతం 'మఫ్టీ' ఫేం నార్తన్‌తో నెక్ట్స్ చిత్రాన్ని చేయబోతుండగా ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ క్రమంలోనే ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమానికి వచ్చిన 700 మందికి పైగా అభిమానులతో సెల్ఫీలు దిగాడు యశ్. అయితే ఒక్కోక్కరితో సింగిల్‌గా దిగగా ఈ సెల్ఫీలు పూర్తి కావడానికి గంట సమయం పట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. యశ్ ఓపికను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'అందుకే కదా రాకింగ్ స్టార్ అనేది' అంటూ పొగిడేస్తున్నారు.
READ MORE
రంగులు ఎప్పుడూ సిగ్గుమాలినవి కావు.. కొందరి ఆలోచనలే సిగ్గులేనివి: సుచిత్ర






