దండం పెడుతా అలాంటి పని చేయకండి.. కేజీఎఫ్ డైరెక్టర్

by Disha Web Desk 8 |
దండం పెడుతా అలాంటి పని చేయకండి.. కేజీఎఫ్ డైరెక్టర్
X

దిశ, సినిమా : కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తీసిన ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేస్తాయి. ఇక ఈ మధ్య ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా సలార్ మూవీ తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే తాజాగా ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఉగ్రం సినిమాతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్..నేను చేసిన తప్పు మీరు చేయోద్దు అంటూ ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు.

ఉగ్రం సినిమా మంచి హిట్ అందుకొంది. దీనికిగాను ప్రశాంత్ నీల్‌కు ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. కానీ ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ ఏకంగా నాలుగు ఏళ్లు టైం తీసుకున్నారు. ఇక ఆ సమయంలో ఆయనకు చాలా ఆఫర్స్ వచ్చినా మూర్ఖత్వంతో ఏది ఎలా తీయాలో తెలియ, సీన్స్ పది సార్లు తెరకెక్కిస్తూ టైం వేస్ట్ చేసుకున్నాడంట. దీంతో నేను అప్పుడు చేసిన తప్పు ఎవరూ చేయకండి. నా జీవితంలో నాకు అదో పెద్ద గుణపాఠం.. అంటూ డైరెక్టర్స్‌కు తెలిపినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Read More..

రికార్డ్ సృష్టించబోతున్న కన్నడ స్టార్.. ‘UI’ మూవీ ఏకంగా అన్ని భాషల్లో రాబోతుందా..?

Next Story
null