Keerthy Suresh: కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ అదిరిపోయిందంతే!

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-12 13:34:06  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)‘మహానటి’ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

Keerthy Suresh: కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ అదిరిపోయిందంతే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)‘మహానటి’ సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో ఫుల్ బిజీ అయిపోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్ రీటా’(Revolver Rita). ఈ ఈ సినిమాకు జేకే చండూరు(JK Chanduru) దర్శకత్వం వహిస్తుండగా.. దీనిని ఫ్యాషన్ స్టూడియో నిర్మిస్తోంది.

అయితే ఇందులో కీర్తి సురేష్ పోలీస్ పాత్రను పోషిస్తోంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్(Radhika Sarathkumar), సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ, సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఇందులోంచి విడుదల అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, కీర్తి సురేష్ ‘రివాల్వర్ రీటా’ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.

ఈ సినిమా ఆగస్టు 27న రాబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇందులో గ్రీన్ కలర్ చూడీదార్ ధరించి ఓ ట్రాలీబ్యాగ్‌లో శవాన్ని పెట్టి దానిపై కూర్చొని ఉండగా.. వెనకాల ఒక కారు ఉంది. లేడీ డాన్‌గా కనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమె పోస్టర్ అంచనాలను పెంచుతోందని అంటున్నారు.

Next Story