- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త ప్రయాణం స్టార్ట్ చేసిన కీర్తి సురేష్.. ‘మహానటి’ సినిమా తర్వాతే ఇదంతా జరిగిందంటూ షాకిచ్చిందిగా!
చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు.

దిశ, సినిమా: చాలామంది హీరోయిన్లు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. ఇక కీర్తి సురేష్ కూడా అలాగే చేస్తుందని అనుకున్న వారందరి అపోహలకు ఆమె చెక్ పెట్టింది. పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. స్పీడ్ మీదున్న కీర్తి సురేష్ (Keerthy Suresh)త్వరలో ‘రివాల్వర్ రిటా’(Revolver Rita) చిత్రంతో అలరించేందుకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కొత్త ప్రయాణం స్టార్ట్ చేసినట్లు వెల్లడించింది. నా భర్త సినిమాల్లోకి వచ్చి నాతో నటించే ప్రసక్తి లేదు. కానీ నేను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా’’ అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. నటిస్తూ డైరెక్టింగ్ చేసే లిస్ట్‌లోకి కీర్తి సురేష్ పేరు కూడా చేరనుంది. లేడీ మెగాఫోన్ ట్రాక్‌లోకి దిగేందుకు సిద్ధమైంది.
అలాగే తన ఫిట్‌నెస్ గురించి చెప్తూ.. ‘‘నేను బొద్దుగా ఉన్నప్పుడు చాలా బాగున్నానని చాలామంది అంటున్నారు. ఆ సమయంలో నాకు 10 దోసెలు/10 ఇడ్లీలు తినాలని ఉండేది. ఇప్పుడు నాకు ఆహార నియంత్రణ లేదు. కానీ నేను వ్యాయామం చేస్తాను. 10-12 నెలల్లో నేను దాదాపు 10 కిలోలు తగ్గాను. నటనతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని నేను భావిస్తున్నాను. నేను 4 సంవత్సరాల ముందే చర్మంపై కూడా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాను. ‘మహానటి’ తర్వాత ఇదంతా జరిగింది’’ అని చెప్పుకొచ్చింది.






