రొమాంటిక్ థ్రిల్లర్‌తో రాబోతున్న కీర్తి సురేష్.. లైనప్ మామూలుగా లేదుగా!

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-03 14:56:29  IST  )

కీర్తి సురేష్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కొత్త మూవీ ఒక వినూత్నమైన రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్నట్లు సమాచారం.

రొమాంటిక్ థ్రిల్లర్‌తో రాబోతున్న కీర్తి సురేష్.. లైనప్ మామూలుగా లేదుగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్, నేషనల్ అవార్డ్ విన్సర్ కీర్తి సురేష్ గత ఏడాది ‘రివాల్వర్ రీటా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘రౌడీ జనార్ధన’ చేస్తుండగా.. రాజ్‌కుమార్ రావు సరసన 'రఫ్తార్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ ఠాకూర్, రోహన్ వర్మ, తాన్యా మణిక్తాలా, రజత్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. ఇది దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

మరోవైపు.. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సత్యవాన్ సావిత్రి' అనే కోర్టు రూమ్ లీగల్ డ్రామా ప్రాజెక్ట్‌ను కూడా కీర్తి ఇటీవల ప్రకటించింది. మలయాళంలో ఆంటోనీ వర్గీస్ పెపేతో కలిసి 'తోట్టం' అనే చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. ఇవే కాకుండా, టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి చేయబోయే మల్టీస్టారర్ చిత్రంలో కూడా కీర్తి సురేష్ ఒక హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలు ఇంకా విడుదల కాకముందే.. కీర్తి సురేష్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ కొత్త మూవీ ఒక వినూత్నమైన రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ, కీర్తి సురేష్ లైనప్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

నా భవిష్యత్తు పాడు కాకుండా అది నాకు ఎంతగానో సహాయపడింది: రియా చక్రవర్తి

Next Story