నా భవిష్యత్తు పాడు కాకుండా అది నాకు ఎంతగానో సహాయపడింది: రియా చక్రవర్తి

by Mallepaka Hamsa |

నేను గత నాలుగేళ్లుగా థెరపీ తీసుకుంటున్నాను. నేను ఎలాంటి వ్యక్తినో తెలుసుకోవడానికి, నా పాత బాధలు నా భవిష్యత్తును పాడు చేయకుండా చూసుకోవడానికి ఈ థెరపీ నాకు ఎంతగానో సహాయపడింది.

నా భవిష్యత్తు పాడు కాకుండా అది నాకు ఎంతగానో సహాయపడింది: రియా చక్రవర్తి
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత జీవితంలో ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఆమెపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్, విమర్శలు వచ్చాయి. అంతటి బాధను అనుభవించినప్పటికీ, ఆమె జీవితంపై నమ్మకాన్ని కోల్పోలేదు. మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో, గత కొన్ని సంవత్సరాలుగా ఆ బాధాకరమైన గతం నుండి బయటపడి తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుందో రియా పంచుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఎలా మార్చేసిందో వివరించింది. "ఆ సంఘటన తర్వాత నేను చాలా మారిపోయాను. ఇప్పుడు నాకు లోకజ్ఞానం బాగా తెలిసింది. నా స్నేహితులు నన్ను చూసి.. 33 ఏళ్ల బాడీలో ఉన్న 80 ఏళ్ల ముసలావిడ అని జోకులు వేస్తుంటారు.

ఎందుకంటే నేను జీవితంలో చాలా చూశాను. మనం అనుభవించిన చేదు జ్ఞాపకాలను అంత తేలికగా మర్చిపోలేం, అవి మనల్ని పూర్తిగా మార్చేస్తాయి" అని ఆమె అన్నారు. ఆ బాధల నుండి ఎలా కోలుకుందో చెబుతూ.. "నేను గత నాలుగేళ్లుగా థెరపీ తీసుకుంటున్నాను. నేను ఎలాంటి వ్యక్తినో తెలుసుకోవడానికి, నా పాత బాధలు నా భవిష్యత్తును పాడు చేయకుండా చూసుకోవడానికి ఈ థెరపీ నాకు ఎంతగానో సహాయపడింది. నేను ఇంకా మంచిగా ఉండాలనే అనుకుంటున్నాను. ప్రేమపై నాకు ఇంకా నమ్మకం ఉంది. నేను అందరిలాగే చాలా నార్మల్‌గా బతకాలని అనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో కేవలం నాకే కష్టాలు వచ్చాయని నేను అనుకోవడం లేదు. నేను కూడా మిగతా 30 ఏళ్ల అమ్మాయిల్లాగే ప్రశాంతంగా జీవిస్తూ, డబ్బు సంపాదిస్తూ, లైఫ్‌లో ఏదైనా సాధించాలని అనుకుంటున్నాను" అంటూ రియా చక్రవర్తి ఎమోషనల్ అయింది.

Next Story