‘ఎల్లమ్మ’ నుంచి కీర్తి సురేష్ ఔట్.. జాక్‌పాట్ కొట్టిన యంగ్ బ్యూటీ?

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-18 15:19:51  IST  )

ఈమె గ్లామర్‌కు ఫిదా అయిన మేకర్స్ వరుస ఆఫర్లు ఇస్తున్నారు. తాజాగా ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో ఈ భామ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

‘ఎల్లమ్మ’ నుంచి కీర్తి సురేష్ ఔట్.. జాక్‌పాట్ కొట్టిన యంగ్ బ్యూటీ?
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సేకు అదృష్టం మామూలుగా వరించడం లేదు. మిస్టర్ బచ్చన్, కాంత వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఈమె గ్లామర్‌కు ఫిదా అయిన మేకర్స్ వరుస ఆఫర్లు ఇస్తున్నారు. తాజాగా ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో ఈ భామ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్‌ను అనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల కీర్తి ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, ఆ లక్కీ ఛాన్స్ భాగ్యశ్రీ తలుపు తట్టింది. కథ విన్న వెంటనే భాగ్యశ్రీ ఈ క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) హీరోగా పరిచయం కాబోతుండటం విశేషం.

Next Story