ఒళ్లు దగ్గర పెట్టుకుని మేకింగ్ నేర్చుకోండి.. దర్శకులకు ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-30 04:41:44  IST  )

దయచేసి 'ధురంధర్ 2'ని ఒక కొత్త కోర్సులా చదవండి. మూవీ మేకింగ్ నేర్చుకోండి, లేదంటే మార్చి 19, 2026 కి ముందున్న పాత సినిమాల సమాధిలో మీరు కూడా పాతిపెట్టబడతారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని మేకింగ్ నేర్చుకోండి.. దర్శకులకు ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్!
X

దిశ, సినిమా: బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్: ది రివెంజ్' సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా రికార్డులన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రం, ఏకంగా రాజమౌళి 'RRR' కలెక్షన్లను దాటేసి 1200 కోట్లకు పైగా వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపుతోంది. అయితే, ఇంతటి భారీ సక్సెస్‌పై ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖులు మౌనంగా ఉండటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా, ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగారు. "ఆదిత్య ధర్ ఫిలిం ఇండస్ట్రీ కింద ఒక అటామిక్ బాంబ్ పేల్చారు. కానీ మిగతా ఇండస్ట్రీ నుండి వస్తున్న ఈ నిశ్శబ్దం నన్ను ఆశ్చర్యపరుస్తోంది" అంటూ ఘాటుగా స్పందించారు.

ఈ సినిమా విజయం అందరినీ స్పేస్‌లోకి నెట్టేసిందా? అందుకే వారి చప్పట్లు ఇక్కడికి వినిపించడం లేదా? లేక ఇదంతా కేవలం ప్రచారమే అని అనుకుంటూ పాత పద్ధతిలోనే సినిమాలు తీద్దామని ప్లాన్ చేస్తున్నారా? అని వర్మ సూటిగా ప్రశ్నించారు. ఇంతటి అద్భుతమైన డైనోసార్ లాంటి సినిమాను చూసి కూడా చూడనట్లు నటించడం మూర్ఖత్వమే అవుతుందని ఆయన హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీలోని తన సహచరులకు వర్మ ఒక సీరియస్ అడ్వైస్ ఇచ్చారు. "దయచేసి 'ధురంధర్ 2'ని ఒక కొత్త కోర్సులా చదవండి. మూవీ మేకింగ్ నేర్చుకోండి, లేదంటే మార్చి 19, 2026 కి ముందున్న పాత సినిమాల సమాధిలో మీరు కూడా పాతిపెట్టబడతారు.

ఒళ్లు దగ్గర పెట్టుకుని మేకింగ్ నేర్చుకోండి" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి, కరణ్ జోహార్ వంటి వారు సినిమాను మెచ్చుకున్నా, కలెక్షన్ల విషయంలో ఇండస్ట్రీ పెద్దలు బహిరంగంగా ప్రశంసించకపోవడాన్ని వర్మ తప్పుబట్టారు. ఈ సినిమాలో రణవీర్ సింగ్ ఒక ఇండియన్ స్పైగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఎలా అంతం చేశారనేది ప్రధాన కథ. ఒక సామాన్యుడు హంజా అలీ మజారీగా మారి, తన కుటుంబాన్ని, స్నేహితులను కోల్పోయి ఒంటరిగా పోరాడే విధానం ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.

నేను సినిమాలు చూడను నా లోకం వేరు.. ఆమిర్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్

Next Story