- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను సినిమాలు చూడను నా లోకం వేరు.. ఆమిర్ ఖాన్ సెన్సేషనల్ కామెంట్స్
మాది చాలా పద్ధతిగా ఉండే కుటుంబం కావడంతో, సినిమాల విషయంలో మా అమ్మనాన్నలు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. దూరదర్శన్‌లో వచ్చే పాత నలుపు-తెలుపు చిత్రాలు తప్ప వేరేవి చూసే ఛాన్స్ ఇచ్చేవారు కాదు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ సినిమాలు తీస్తాను కానీ చూడనని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వందల కోట్లు వసూలు చేసే బ్లాక్ బస్టర్ చిత్రాలు తీసే అమీర్ ఖాన్‌కు, అసలు సినిమాలు చూసే అలవాటే లేదట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. అసలు ఒక స్టార్ హీరో అయ్యుండి సినిమాలకి ఎందుకు దూరంగా ఉంటారో అమీర్ ఇలా వివరించారు: "నాకు చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం అంటేనే ప్రాణం. మాది చాలా పద్ధతిగా ఉండే కుటుంబం కావడంతో, సినిమాల విషయంలో మా అమ్మనాన్నలు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. దూరదర్శన్‌లో వచ్చే పాత నలుపు-తెలుపు చిత్రాలు తప్ప వేరేవి చూసే ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ముఖ్యంగా రొమాంటిక్ మూవీస్ అంటే మా ఇంట్లో అస్సలు ఒప్పుకునేవారు కాదు. అలా చిన్నతనం నుండే నాకు సినిమాల కంటే పుస్తకాలతోనే ఎక్కువ స్నేహం ఏర్పడింది" అని తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. 18 ఏళ్ల వయసులోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అమీర్, తన అలవాటును ఒక ఫన్నీ ఉదాహరణతో చెప్పారు.
"కొందరు ఫుట్‌బాల్ ఆడతారు, మరికొందరు ఫుట్‌బాల్ చూస్తారు. నేను మొదటి రకం. నేను సినిమాలు తీస్తాను కానీ, అస్సలు చూడను. హాలీవుడ్‌లో ఏం జరుగుతుందో, లేటెస్ట్ మూవీస్ ఏవో నాకు అస్సలు తెలియదు. నేను నా సొంత ప్రపంచంలో ఉంటాను" అని నవ్వుతూ చెప్పారు. అశోక్ కుమార్, దిలీప్ కుమార్ వంటి పాతతరం లెజెండ్స్ సినిమాలు తప్ప తను కొత్త చిత్రాలు పెద్దగా చూడనని అమీర్ తెలిపారు. సినిమాలు చూడకపోయినా, నిర్మాతగా అమీర్ ఖాన్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన కుమారుడు జునైద్ ఖాన్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ‘ఏక్ దిన్’ మూవీ మే 1న థియేటర్లలోకి రాబోతోంది. ఇది 2016 నాటి ఒక థాయ్ సినిమాకు రీమేక్ అని టాక్. అలాగే సన్నీ డియోల్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో వస్తున్న పీరియడ్ డ్రామా ‘లాహోర్ 1947’ కూడా అమీర్ నిర్మాణంలోనే రూపొందుతోంది. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల కానుంది.






