పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. స్పెషల్ పర్సన్ వచ్చేశారంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్(Katrina Kaif), విక్కీ కౌశల్(Vicky Kaushal) జంట భారీ గుడ్ న్యూస్ ప్రకటించారు.

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్.. స్పెషల్ పర్సన్ వచ్చేశారంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్(Katrina Kaif), విక్కీ కౌశల్(Vicky Kaushal) జంట భారీ గుడ్ న్యూస్ ప్రకటించారు. తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నేడు (నవంబర్7)న కత్రినా కైఫ్ పండండి మగ బిడ్డకు జన్మినిచ్చింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. మా జీవితంలో ఆనందం రెట్టింపు అయింది. అపారమైన ప్రేమ, కృతజ్ఞతతో మేము.. స్పెషల్ పర్సన్ మా బాబును స్వాగతిస్తున్నాము. మీ ఆశీర్వాదాలు కావాలి’’ అని రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా.. కొన్నాళ్ల పాట డేటింగ్ చేసిన కత్రినా, విక్కీ పెద్దలను ఒప్పించి 2021లో పెళ్లితో ఒక్కటయ్యారు. కత్రినా కంటే విక్కీ చిన్నవాడు అయినప్పటికీ ఏజ్‌తో సంబంధం లేదంటూ.. ఏడడుగులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పెళ్లైన నాలుగేళ్లకు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే.. ఇటీవల ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించారు. ఇక ఇప్పుడు తల్లిదండ్రులై తమ ఇంట్లోకి స్పెషల్ పర్సన్ రావడంతో సంతోషపడుతున్నారు. సినిమాల విషయానికొస్తే.. కత్రినా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ విక్కీ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ‘ఛావా’తో సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ప్రజెంట్ ‘లవ్ అండ్ వార్’ మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Next Story